KVP: గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేసిన కేవీపీ రామచంద్రరావు!

  • పోలవరం ప్రాజెక్టులో అవినీతి
  • గవర్నర్ ను కలిసి చర్యలు తీసుకోవాలని వినతి
  • ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కృషి చేయాలని కోరిన కేవీపీ

తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు కొద్దిసేపటి క్రితం కలిశారు. పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, ఈ విషయమై విచారణ జరిపించి, చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కలసి వినతిపత్రాన్ని అందించినట్టు కేవీపీ వెల్లడించారు.

 అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసేందుకు కృషి చేయాలని కోరినట్టు తెలిపారు. తన నుంచి గవర్నర్ మరిన్ని వివరాలను కోరారని, తన వద్ద ఉన్న అన్ని వివరాలనూ ఆయనకు అందించానని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల బాగుకోసం ఈ ప్రాజెక్టు ఎంతో అవసరమని చెప్పానని పేర్కొన్నారు. తాను గవర్నర్ కు ఇచ్చిన వినతిపత్రంలో ఎన్నో విషయాలను పొందుపరిచానని, వాటన్నింటినీ పరిశీలించి చర్యలు తీసుకుంటానని గవర్నర్ హామీ ఇచ్చారని కేవీపీ తెలిపారు.

KVP
Narasimhan
Andhra Pradesh
Polavaram
  • Loading...

More Telugu News