Shahid Kapoor: 'ఏం.. నీకు లేదా గర్ల్ ఫ్రెండ్?'... విలేకరిపై షాహిద్ కపూర్ చిందులు!

  • ఇటీవల 'కబీర్ సింగ్' ట్రయిలర్ లాంచ్
  • కైరా అద్వానీని ముద్దు సీన్లపై ప్రశ్నించిన మీడియా
  • కోపం తెచ్చుకున్న షాహిద్

తెలుగులో సూపర్ హిట్ అయిన విజయ్ దేవరకొండ చిత్రం 'అర్జున్ రెడ్డి' హిందీ రీమేక్ 'కబీర్ సింగ్' ట్రయిలర్ లాంచ్ సందర్భంగా ప్రశ్నలు సంధించిన ఓ విలేకరిపై నటుడు షాహిద్ కపూర్ చిందులు తొక్కాడు.

సినిమా హీరోయిన్ కైరా అద్వానీని ఓ విలేకరి పలకరిస్తూ, "ఈ సినిమాలో ముద్దు సన్నివేశాల్లో నటించినప్పుడు ఏమీ అనిపించలేదా?" అని ప్రశ్నించాడు. దీంతో కాస్తంత అసౌకర్యంగా ఫీలైన కైరా, ఏమీ మాట్లాడకపోగా, మళ్లీ అదే ప్రశ్నను సంధించాడు. దీంతో పక్కనే ఉన్న షాహిద్ కు చిర్రెత్తుకొచ్చింది.

"ఏం, నీకు జీవితంలో గర్ల్‌ఫ్రెండ్‌ లేదా? ముద్దు సీన్ల గురించి వదిలేసి మరేదైనా అడగండి" అని అన్నాడు. సినిమాలో నటించిన ఇతరులూ ఇక్కడే ఉన్నారని, వారిని ఏదైనా అడగవచ్చని సలహా ఇచ్చాడు. కాగా, ఈ చిత్రం జూన్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Shahid Kapoor
Kabir Singh
Kiss Scenes
Kiara Advani
  • Loading...

More Telugu News