hanuma vihari: చంద్రబాబును కలిసిన క్రికెటర్ హనుమ విహారి.. వివాహానికి ఆహ్వానం!

  • 19న హనుమ విహారి వివాహం
  • ఫ్యాషన్ డిజైనర్ ప్రీతిరాజ్ తో వరంగల్ లో పెళ్లి
  • 20న హైదరాబాదులో పెళ్లి రిసెప్షన్

భారత యువ క్రికెటర్, తెలుగుతేజం హనుమ విహారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశాడు. ఈనెల 19వ తేదీన వరంగల్ లో హనుమ విహారి వివాహం జరగనుంది. వరంగల్ కు చెందిన ఫ్యాషన్ డిజైనర్ ప్రీతిరాజ్ తో గత ఏడాది అక్టోబర్ లో విహారికి నిశ్చితార్థం జరిగింది. 20న హైదరాబాదులో వీరి రిసెప్షన్ జరగనుంది. ఈ నేపథ్యంలో అమరావతిలో చంద్రబాబును విహారి కలిశాడు. తమ వివాహపత్రికను అందించి, పెళ్లికి రావాలంటూ ఆహ్వానించాడు.

hanuma vihari
chandrababu
marriage
  • Loading...

More Telugu News