Keshavareddy: కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రొద్దుటూరు కోర్టుకు కేశవరెడ్డి!

  • గతంలో ఇచ్చిన చెక్కులు బౌన్స్
  • ప్రస్తుతం అనంతపురం జైల్లో కేశవరెడ్డి
  • విచారణ నిమిత్తం ప్రొద్దుటూరుకు

గతంలో పలువురికి తాను ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో, కోర్టు కేసులను ఎదుర్కొంటూ, ప్రస్తుతం అనంతపురం సెంట్రల్ జైల్లో ఉన్న కేశవరెడ్డి విద్యాసంస్థల మాజీ చైర్మన్‌ కేశవరెడ్డిని నిన్న కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రొద్దుటూరు కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. పట్టణానికి చెందిన క్రిష్ణమోహన్‌, నాగరాజు అనే వ్యక్తులకు ఆయన ఇచ్చిన చెక్కులు చెల్లకపోగా, వారు కోర్టును అశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ సెకెండ్‌ ఏడీఎం కోర్టు మేజిస్ట్రేట్‌ ముందు సాగుతుండగా, కేశవరెడ్డి హాజరయ్యారు. విచారణను 22కు వాయిదా వేసినట్టు కోర్టు వర్గాలు పేర్కొన్నాయి. 

Keshavareddy
Anantapur District
Central Jail
Court
  • Loading...

More Telugu News