Kanchikacherla: డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులకు షాకిచ్చిన ప్రైవేట్ బస్ డ్రైవర్లు!

  • కంచికచర్ల సమీపంలో తనిఖీలు
  • పట్టుబడిన పలు ప్రైవేట్ బస్సు డ్రైవర్లు
  • అందరిపైనా కేసుల నమోదు 

డ్రంకెన్ డ్రైవ్‌ తనిఖీలు చేస్తున్న పోలీసులకు ప్రైవేట్ బస్ డ్రైవర్లు షాక్ ఇచ్చారు. నిన్న రాత్రి విజయవాడ సమీపంలోని కంచికచర్ల వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించగా, పలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్లు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెడుతూ, బస్సును నడుపుతూనే మద్యం తాగుతున్నారనడానికి ఆనవాళ్లు కనిపించడంతో పోలీసులు అవాక్కయ్యారు. వెంకట పద్మావతి, జీవీఆర్‌, కనకదుర్గ ట్రావెల్స్‌ డ్రైవర్లు తనిఖీల్లో పట్టుబడగా, వారందరిపై కేసులను నమోదు చేశారు.  

Kanchikacherla
Police
Drunk Driving
Drivers
  • Error fetching data: Network response was not ok

More Telugu News