Narendra Modi: మోదీని సర్కస్‌లోని సింహంతో పోల్చిన పంజాబ్ మంత్రి

  • మోదీ భారత సింహం కాదు.. సర్కస్ సింహం
  • ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఆయన విఫలం
  • విరుచుకుపడిన మంత్రి మన్‌ప్రీత్ సింగ్

ప్రధానమంత్రి నరేంద్రమోదీని సర్కస్‌లోని సింహంతో పోల్చారు కాంగ్రెస్ నేత, పంజాబ్ ఆర్థిక శాఖ మంత్రి మన్‌ప్రీత్ సింగ్. మోదీ తనకు తాను ఈ దేశానికి సింహానిగా చెప్పుకుంటున్నారని, కానీ నిజానికి ఆయన సర్కస్‌లోని సింహం లాంటివారని అభివర్ణించారు. సింహాల్లో రెండు రకాలు ఉంటాయని, ఒకటి అడవిలో ఉంటుందని, రెండో రకం సర్కస్‌లలో ఉంటాయని పేర్కొన్నారు. మోదీ కూడా సర్కస్‌లోని సింహంలాంటి వారేనని మంత్రి అన్నారు.

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అన్ని విషయాల్లోనూ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో మోదీ పూర్తిగా విఫలమయ్యారని, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని మంత్రి మన్‌ప్రీత్ విమర్శించారు.

Narendra Modi
lion
punjab
Minister
  • Loading...

More Telugu News