Gajwel: గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి దీక్ష భగ్నం.. ఆసుపత్రికి తరలించిన పోలీసులు

  • ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం కోసం ఆమరణ నిరాహార దీక్ష
  • భగ్నం చేసి హైదరాబాద్‌కు తరలింపు
  • న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదన్న నర్సారెడ్డి

సాగునీటి ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు మంగళవారం భగ్నం చేశారు. అనంతరం ఆయనను అంబులెన్సులో బలవంతంగా గజ్వేల్ నుంచి హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు.

ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ.. పోలీసులు తన దీక్షను బలవంతంగా భగ్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిర్వాసితులకు, రైతులకు న్యాయం జరిగే వరకు తన దీక్ష కొనసాగుతుందని పేర్కొన్నారు. భూ నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ అందించాలని డిమాండ్ చేశారు. అలాగే కోర్టు కేసులో ఉన్న భూముల్లో ప్రాజెక్ట్ నిర్మాణ పనులు నిలిపివేయాలని కోరారు. 

Gajwel
T.Narsareddy
Telangana
Congress
Hyderabad
  • Loading...

More Telugu News