modi: వారణాసిలో నేను ప్రచారం చేయకపోవచ్చు: హింట్ ఇచ్చిన మోదీ

  • వారణాసి ప్రజలకు మోదీ వీడియో మెసేజ్
  • మోదీ గెలవాలని కాశీ ప్రజలంతా కోరుకుంటున్నారు
  • సంప్రదాయ దుస్తులను ధరించి ఓటు వేయండి

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చివరి దశ పోలింగ్ మరో ఐదు రోజుల్లో జరగనుంది. ఈ నేపథ్యంలో తన నియోజకవర్గమైన వారణాసి ఓటర్లకు మోదీ ఓ వీడియో మెసేజ్ పంపారు. వారణాసిలో తాను ప్రచారం చేయకపోవచ్చనే సంకేతాలను ఈ వీడియో ద్వారా ఇచ్చారు.

'వారణాసిలో నేను రోడ్ షోకు వచ్చినప్పుడు... మరోసారి ఇక్కడకు రావద్దని మీరు నన్ను ఆదేశించారు. అన్ని విషయాలను సమర్థవంతంగా మీరే చూసుకుంటామని చెప్పారు. మీ మాటలపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. మోదీ గెలవాలని కాశీలోని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు' అని మోదీ తెలిపారు.

వారణాసిలోని ప్రతి ఓటరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా మోదీ కోరారు. దేశం మొత్తం కాశీవైపే చూస్తోందని చెప్పారు. ఎన్నికలకు సంబంధించిన రికార్డులను ఈసారి కాశీ తిరగరాయాలని చెప్పారు. సంప్రదాయ దుస్తులను ధరించి ఓటు వేయాలని కోరారు.

modi
varanasi
bjp
campaigning
  • Loading...

More Telugu News