Tirumala: తిరుమల రహదారిలో అదుపు తప్పిన బస్సు.. పలువురికి గాయాలు!

  • తిరుపతి నుంచి కొండపైకి వెళ్తుండగా ఘటన
  • టూవీలర్ ను తప్పించబోయి అదుపు తప్పిన బస్సు
  • పది మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు

తిరుపతి నుంచి తిరుమల కొండపైకి వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు పెద్ద ప్రమాదం తప్పింది. తిరుమల రెండో కనుమ రహదారి మార్గంలో ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయిన బస్సు అదుపు తప్పింది. దీంతో, చెట్టుకొమ్మలకు తగిలి లోయలోకి వెళ్లకుండా బస్సు ఆగిపోయింది. లేకపోతే, పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. ఈ ఘటనలో పది మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి టీటీడీ అధికారులు చేరుకుని, ఈ ఘటన జరిగిన తీరుపై ఆరా తీశారు.

Tirumala
Tirupati
RTc bus
  • Loading...

More Telugu News