amberpet: అంబర్ పేటలో అక్కడ అసలు మసీదు లేదు.. కానీ ఉన్నట్టుగా చూపే యత్నం చేస్తోంది!: మజ్లిస్ పై కిషన్ రెడ్డి ఫైర్

  • ఎంఐఎం లేనిపోని సమస్యలు సృష్టిస్తోంది
  • నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు
  • మత సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం తగదు

ఎంఐఎంపై బీజేపీ నేత కిషన్ రెడ్డి మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న అంబర్ పేట్ లో లేనిపోని సమస్యలను ఈ పార్టీ సృష్టిస్తోందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం చేతకానితనం వల్లనే ఈ సమస్య తలెత్తిందని, అంబర్ పేట ఎమ్మెల్యేగా తాను ఉన్న సమయంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి రాలేదని అన్నారు. అంబర్ పేటలో అక్కడ అసలు మసీదు లేదని, కానీ ఉన్నట్టుగా చూపే ప్రయత్నం ఎంఐఎం చేస్తోందని, మత సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడే ఆ వివాదాస్పద స్థలాన్ని ఆ స్థలం యజమానులకు ప్రభుత్వం డబ్బు చెల్లించి స్వాధీనం చేసుకుందని గుర్తుచేశారు.

amberpet
mosque
mim
bjp
kishan reddy
  • Loading...

More Telugu News