Andhra Pradesh: తల్లిదండ్రుల్లారా.. మీ పిల్లలను ఇతరులతో పోల్చకండి.. ధైర్యం చెప్పండి!: సుజనా చౌదరి

  • ఏపీలో 10వ తరగతి ఫలితాలు విడుదల
  • తక్కువ మార్కులు వస్తే కుంగిపోవద్దని పిల్లలకు సూచన
  • మార్కులు ప్రతిభ, తెలివితేటలకు కొలమానం కాదని వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నేత సుజనా చౌదరి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీలోని  పదో తరగతి పిల్లల తల్లిదండ్రులకు ఆయన కీలక సూచన చేశారు.

మార్కుల ఆధారంగా మీ పిల్లలను ఇతరులతో పోల్చవద్దని హితవు పలికారు. మార్కులు సరిగ్గా రాని పిల్లలు కుంగిపోకుండా ధైర్యం చెప్పాలని సూచించారు. విద్యార్థుల తెలివితేటలకు, ప్రతిభకు మార్కులే కొలమానం కాదని స్పష్టం చేశారు. జీవితంలో సాధించాల్సింది ఎంతో ఉందని చెప్పాల్సిందిగా కోరారు. ఈ మేరకు సుజనా చౌదరి ఈరోజు ట్విట్టర్ లో స్పందించారు.

Andhra Pradesh
Telugudesam
Sujana Chowdary
ssc results
  • Loading...

More Telugu News