Andhra Pradesh: జగన్ సీఎం కావడం ఖాయం.. మాకు 120 సీట్లు గ్యారెంటీ!: వైసీపీ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్

  • ప్రజల మద్దతు జగన్ కే ఉంది
  • సర్వేలు కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి
  • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వైసీపీ నేత

వైసీపీ నేత, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉదయాన్నే స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఈసారి వైసీపీ అధికారంలోకి రావాలని శ్రీ వేంకటేశ్వరస్వామిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.

ఈసారి ఏపీలో 120 అసెంబ్లీ స్థానాల్లో ఘనవిజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత జగన్ ఏపీ ముఖ్యమంత్రి కావడం తథ్యమనీ, ప్రజల మద్దతు ఆయనకే ఉందని స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలో సర్వేలన్నీ జగన్ కే అనుకూలంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. కాగా, ఈరోజు మహర్షి సినిమా దర్శక, నిర్మాతలు పైడిపల్లి వంశీ, దిల్‌రాజు కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దిల్ రాజు, వంశీ మొక్కులు చెల్లించుకున్నారు.

Andhra Pradesh
Jagan
YSRCP
120 seats
pilli subhash chandrabos
Tirumala
  • Loading...

More Telugu News