Hazipur: హాజీపూర్ శ్రీనివాస్ రెడ్డి ప్రియురాలు క్షేమమే!

  • ఫేస్ బుక్ ప్రొఫైల్ పిక్ లో యువతి
  • ఆరాతీసి బతికేవుందని తేల్చిన పోలీసులు
  • ఫేస్ బుక్ సంబంధాలు లేవని నిర్ధారణ 

హాజీపూర్ వరుస హత్యల నిందితుడు, సైకో శ్రీనివాస్ రెడ్డిని ప్రేమించిన వేములవాడ యువతి క్షేమంగానే ఉందని పోలీసులు నిర్ధారించుకున్నారని తెలుస్తోంది. విచారణలో భాగంగా శ్రీనివాస్ రెడ్డి ఫేస్ బుక్ ఖాతాను ఓపెన్ చేసిన పోలీసులు, ప్రొఫైల్ పిక్ లో ఉన్న ఆ యువతిని గురించి ఆరాతీశారు. ఆపై ప్రత్యేక బృందాన్ని వేములవాడకు పంపించి, ఆమె క్షేమంగానే ఉందని తేల్చారు.

ఇక శ్రీనివాస్ రెడ్డి స్నేహితుల్లో అత్యధికులు అమ్మాయిలే కనిపించడంపైనా పోలీసులు దృష్టిని సారించారు. వారిలో ఎవరితోనైనా శ్రీనివాస్ రెడ్డికి సంబంధముందా అన్న కోణంలోనూ విచారించారు. అయితే, వారెవరో తనకు తెలియదని, కేవలం ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపితే యాక్సెప్ట్ చేశారని, తనకు సంబంధాలు లేవని నిందితుడు చెప్పినట్టు తెలుస్తోంది. ఫేస్ బుక్ స్నేహితురాళ్లతో నిందితుడు చాటింగ్ చేయలేదని కూడా పోలీసులు గుర్తించినట్టు సమాచారం.

Hazipur
Killer
Facebook
Police
  • Error fetching data: Network response was not ok

More Telugu News