Congress: సంప్రదాయబద్ధంగా చీరకట్టులో ప్రియాంక ప్రత్యేక పూజలు
- ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో ప్రియాంక సందడి
- ప్రియాంక వెంట సీఎం కమల్ నాథ్ తదితరులు
- అభిషేకం చేయించిన ప్రియాంక
ఆధునికతకు ప్రతిరూపంలా కనిపించే ప్రియాంక గాంధీ ఎన్నికల నేపథ్యంలో భారతీయతను ప్రతిబింబించేలా సంప్రదాయబద్ధంగా ఉజ్జయిని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చీరకట్టులో మహాకాళేశ్వర్ ఆలయాన్ని సందర్శించిన ప్రియాంక అభిషేకం చేయించారు. హిందుత్వాన్ని ప్రతిబింబించేలా ఆలయంలోకి విచ్చేసిన ఈ కాంగ్రెస్ నేత అత్యంత భక్తిశ్రద్ధలతో అభిషేకంలో పాల్గొన్నారు. ప్రియాంకతో పాటు మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్, ఇతర కాంగ్రెస్ నేతలు కూడా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పూజ అనంతరం ప్రియాంక రోడ్ షోలో పాల్గొన్నారు.