Srinivasa Reddy: ముగిసిన సైకో శ్రీనివాసరెడ్డి పోలీస్ కస్టడీ.. వరంగల్ సెంట్రల్ జైలుకి తరలింపు

  • బుధవారం కస్టడీలోకి తీసుకున్న పోలీసులు
  • పలు కోణాల్లో విచారణ
  • మరికొందరి పాత్రపై అనుమానాలు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హాజీపూర్ వరుస హత్యల నిందితుడు సైకో శ్రీనివాసరెడ్డి పోలీస్  కస్టడీ ముగిసింది. దీంతో నేడు శ్రీనివాసరెడ్డిని యాదాద్రి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశానుసారం తిరిగి నిందితుడిని వరంగల్ సెంట్రల్ జైలుకి తరలించారు. శ్రీనివాసరెడ్డిని బుధవారం కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ఆరు రోజుల పాటు విచారించారు. బాలికల అత్యాచారం, హత్యలలో మరికొందరి పాత్ర కూడా ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలోనే శ్రీనివాసరెడ్డిని విచారించినట్టు తెలుస్తోంది.

Srinivasa Reddy
Hazipur
Custody
Warangal Central Jail
Court
  • Loading...

More Telugu News