Kamal Haasan: కమలహాసన్ ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించాలని ఈసీకి బీజేపీ ఫిర్యాదు
- గాడ్సేను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలతో దుమారం
- తీవ్ర స్థాయిలో ఫైర్ అయిన అశ్విని ఉపాధ్యాయ్
- కమల్‌పై చర్య తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు
ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమలహాసన్ ఆదివారం తమిళనాడులోని అరవకురిచి ప్రచార ర్యాలీలో భాగంగా నాథూరామ్ గాడ్సేను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపాయి. ‘స్వతంత్ర భారతావనిలో తొలి ఉగ్రవాది ఒక హిందువు. ఆయన పేరు నాథూరామ్ గాడ్సే. అప్పటి నుంచే ఈ ఉగ్రవాదం ప్రారంభమైంది. ఈ ప్రాంతంలో ముస్లిం సోదరులు ఎక్కువగా ఉన్న కారణంగా నేను ఈ వ్యాఖ్యలు చేయట్లేదు. గాంధీ విగ్రహం ఎదుట నిలబడి ఈ మాటలు మాట్లాడుతున్నాను’ అని కమల్ వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపాయి. దీనిపై బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కమల్‌పై చర్య తీసుకోవాలంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా కమల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఐదు రోజుల పాటు నిషేధం విధించాలని అశ్విని కోరారు.