Telangana: వీహెచ్ పై దురుసు ప్రవర్తన.. పార్టీ నుంచి నగేశ్ ముదిరాజ్ సస్పెన్షన్

  • క్రమశిక్షణా చర్యల్లో భాగంగా నగేశ్ పై వేటు
  • కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా కమిటీ సమావేశం
  • నగేశ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ప్రకటన

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్)పై దురుసుగా ప్రవర్తించిన పీసీసీ కార్యదర్శి నగేశ్ ముదిరాజ్ పై సస్పెన్షన్ వేటు పడింది. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా కమిటీ సమావేశం జరిగింది. క్రమశిక్షణా సంఘం ఎదుట హాజరైన నగేశ్ ముదిరాజ్ జరిగిన ఘటనపై వివరణ ఇచ్చారు. అన్ని అంశాలపై లోతుగా పరిశీలించిన క్రమశిక్షణా సంఘం నగేశ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కాగా,ఈ నెల 11న ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ధర్నాలో వీహెచ్, నగేశ్ మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటన జరిగిన రోజే వీహెచ్ లిఖితపూర్వకంగా పార్టీకి ఫిర్యాదు చేశారు. 

Telangana
gandhi bhavan
Nagesh Mudiraj
VH
  • Loading...

More Telugu News