saudi arabia: సౌదీ అరేబియాకు షాక్.. విద్రోహచర్యలో రెండు ఆయిల్ నౌకలకు తీవ్ర నష్టం!

  • ఆయిల్ నౌకలను దెబ్బతీసిన ముష్కరులు
  • ఆగ్రహం వ్యక్తం చేసిన సౌదీ అరేబియా
  • అదృష్టవశాత్తూ సముద్రంలోకి ఒలకని చమురు

 సౌదీ అరేబియాకు చెందిన రెండు ఆయిల్ నౌకలపై గుర్తుతెలియని దుండగులు విద్రోహ చర్యకు పాల్పడ్డారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) తీరానికి సమీపంలో ఈ నౌకలపై భీకర దాడి జరిగిందని సౌదీ ఇంధన శాఖ మంత్రి ఖలీద్ అల్ ఫలీహ్ తెలిపారు. ఈ ఘటన జరిగినప్పుడు రెండు ట్యాంకర్లలో ముడిచమురు నిండుగా ఉందని చెప్పారు. 

తమ నౌకలు అరేబియన్ గల్ఫ్ దాటుతున్న క్రమంలో ఈ దాడి జరిగిందనీ, తమ నౌకలు బాగానే దెబ్బతిన్నాయని అన్నారు. అయితే అదృష్టవశాత్తూ ఆయిల్ సముద్రంలోకి ఒలకలేదని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ నౌకాయానం స్వేచ్ఛగా సాగాల్సిన అవసరముందని, ఇందుకు ప్రపంచదేశాలన్నీ కలసి రావాలని పిలుపునిచ్చారు.

దక్షిణ అమెరికాలో వెనిజులా తర్వాత సౌదీ అరేబియాలోనే అత్యధిక ఆయిల్ నిల్వలు ఉన్నాయి. సౌదీలో 268 బిలియన్ బ్యారెళ్ల ముడిచమురు నిల్వలు ఉన్నాయి. ప్రస్తుతం సౌదీ రోజుకు 7.6 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురును ఉత్పత్తి చేస్తోంది.

  • Loading...

More Telugu News