Andhra Pradesh: ఏపీ ఇంటర్ బోర్డు ఆఫీసు ఎదుట ఉద్రిక్తత.. ఎస్ఎఫ్ఐ నేతల అరెస్ట్!

  • ఏపీలో వేసవిలో అదనపు తరగతులు
  • అధికారులకు ఫిర్యాదు చేసేందుకు నేతల యత్నం
  • అడ్డుకున్న పోలీసులు. ఇరువర్గాల మధ్య తోపులాట

  విజయవాడలో ఉన్న ఏపీ ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు ఈరోజు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఏపీలో కొన్ని కార్పొరేట్ కాలేజీలు వేసవిలో కూడా ఇష్టానుసారం క్లాసులు నిర్వహించడంపై ఫిర్యాదు చేసేందుకు స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ) నేతలు ఈరోజు ఇంటర్ బోర్డు ఆఫీసు దగ్గరకు చేరుకున్నారు.

అయితే పోలీసులు వారిని అధికారులను కలుసుకునేందుకు అనుమతించలేదు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకోగా, ఎస్ఎఫ్ఐ నేతలు, సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు. కాగా, ఈ విషయంలో తమ ఆందోళనను కొనసాగిస్తామని ఎస్ఎఫ్ఐ నేతలు ప్రకటించారు.

Andhra Pradesh
Vijayawada
sfi
inter board
police
arrest
  • Loading...

More Telugu News