: సీఎంగా కిరణ్ కేం ఢోకాలేదు: ప్రభుత్వ విప్
ఇటీవల కాలంలో మంత్రుల్లో కొందరు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహారశైలిపై బహిరంగంగానే అసంతృప్తి వెళ్ళగక్కుతున్న నేపథ్యంలో ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి స్పందించారు. ఢిల్లీలో ఆయన నేడు మీడియాతో మాట్లాడారు. సీఎంగా కిరణ్ కేమీ ఢోకా లేదని చెబుతూ, క్యాబినెట్ కిరణ్ కు మద్దతిస్తుందని తెలిపారు. మంత్రుల్లో అత్యధికులు కిరణ్ ను సమర్థిస్తున్నారని అన్నారు. ఇక ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్, బంగారుతల్లి పథకాలు ఓట్లు దండుకోవడానికి ప్రవేశపెట్టలేదని జగ్గారెడ్డి వివరించారు.