Anil: మొబైల్ అదృశ్యం విషయమై ఘర్షణ.. మహిళలు, చిన్నారి సహా 8 మందికి గాయాలు

  • మొబైల్ పోగొట్టుకున్న అనిల్
  • బుజ్జి అనే వ్యక్తిని నిలదీయడంతో ఘర్షణ
  • గాయపడిన వారిని ఆసుపత్రికి తరలింపు

మొబైల్ ఫోన్ అదృశ్యంలో జరిగిన ఘర్షణలో 8 మంది గాయాల పాలైన ఘటన కృష్ణా జిల్లా నందిగామ మండలం లింగాలపాడు ఎస్సీ కాలనీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, లింగాలపాడుకు చెందిన వేల్పుల అనిల్‌కు చెందిన మొబైల్ అదృశ్యమైంది. ఈ విషయమై అదే గ్రామానికి చెందిన బుజ్జి అనే వ్యక్తిని నిలదీయడంతో వారిద్దరి మధ్య ఘర్షణ తలెత్తింది.

విషయం తెలుసుకున్న ఇరు వర్గాల వారూ ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో మహిళలు, చిన్నారి సహా 8 మంది, మార్కపూడి కుమార్, గోపీచంద్, గరికపాటి తిరుపతమ్మ, గరికపాటి కోటేశ్వరి, మార్కపూడి శ్రీకాంత్, వేల్పుల సుధ, మార్కపూడి నాగయ్య, గరికపాటి కృపారావు గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్సై కిశోర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Anil
Bujji
Srikanth
Kishore
Gopi chand
Koteswari
Sudha
  • Loading...

More Telugu News