Bharath Kamma: విజయ్ దేవరకొండను చెడ్డ విద్యార్థితో పోలుస్తూ భరత్ కమ్మా ట్వీట్

  • ఈ పాట కోసం ఎదురు చూస్తున్నారని తెలుసు
  • విజయ్‌ మమ్మల్ని పని చేసుకోనివ్వలేదు
  • దీనికి క్షమాపణ కోరుతున్నా

భరత్ కమ్మా దర్శకత్వంలో యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఒక పాట విడుదల కాగా, మరో పాట నేడు విడుదల కావాల్సి ఉంది. కానీ ఆ పాట విడుదల చేయడం లేదని దానికి కారణం విజయ్ అని, తమ పని తమను చేసుకోనివ్వడం లేదని భరత్ సరదాగా ట్వీట్ చేశారు. దీనికి విజయ్ కూడా అంతే సరదాగా రిప్లై ఇచ్చాడు.

‘మీరు ఈ పాట కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. ప్రతి తరగతిలో ఇతరుల దృష్టి మళ్లించే ఓ చెడ్డ విద్యార్థి ఉన్నట్లే.. విజయ్‌ మమ్మల్ని పని చేసుకోనివ్వలేదు. దీనికి క్షమాపణ కోరుతున్నా’ అని భరత్ ట్వీట్ చేశారు. దీనికి విజయ్, ‘‘నా పుట్టినరోజు.. బాగా క్రికెట్‌ ఆడాం. ఒళ్లు నొప్పులొచ్చేశాయ్‌. కూర్చుని పాట విన్నాం.. కానీ వీడియో కటింగ్‌ పూర్తి చేయలేదు. టీచర్‌ (దర్శకుడు) దృష్టి మారింది. పాటను పక్కాగా మే 15న ఉదయం 11.11 గంటలకు విడుదల చేస్తాం... అమ్మతోడు..’ అని రిప్లై ఇచ్చాడు. ఈ చిత్రం జులై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Bharath Kamma
Vijay Devarakonda
Rashmika
Dear Comrade
Video
  • Loading...

More Telugu News