Balakrishna: అత్యంత ప్రాచీన పుణ్యక్షేత్రం 'లోవ'లో బాలకృష్ణ సందడి

  • తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకున్న బాలయ్య
  • ఘనస్వాగతం పలికిన ఆలయవర్గాలు
  • ఆరాధ్య కథానాయకుడ్ని చూసేందుకు వెల్లువెత్తిన అభిమానులు

తూర్పు గోదావరి జిల్లా తుని మండలంలో ఉన్న లోవ వద్ద తలుపులమ్మ అమ్మవారి అత్యంత ప్రాచీన ఆలయం ఉన్న సంగతి తెలిసిందే. ఇక్కడికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. తాజాగా, సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ లోవ పుణ్యక్షేత్రానికి విచ్చేశారు. ఈ ఉదయం తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అంతకుముందు ఆలయ అధికారులు బాలయ్యకు ఘనస్వాగతం పలికారు. ఆచార సంప్రదాయాలను అనుసరించి బాలయ్యను ఆలయంలోకి తోడ్కొని వెళ్లారు. పూజా కార్యక్రమాల అనంతరం తీర్థప్రసాదాలు అందించారు. కాగా, తమ ఆరాధ్య హీరో వస్తున్నాడని తెలిసి నందమూరి అభిమానులు ఆలయం వద్దకు తండోపతండాలుగా తరలివచ్చారు. దాంతో తలుపులమ్మ ఆలయ పరిసరాల్లో తీవ్ర జనసందోహం కనిపించింది.

  • Loading...

More Telugu News