Visakhapatnam District: ఏఓబీలో మావోయిస్టు అగ్రనేతలు చలపతి, అరుణ్‌, నవీన్‌?

  • అలర్టయిన పోలీసులు
  • విస్తృతంగా కూంబింగ్‌ నిర్వహిస్తున్న భద్రతా బలగాలు
  • విశాఖ ఏజెన్సీలో ఉద్రిక్త పరిస్థితులు

విశాఖ ఏజెన్సీలో మళ్లీ టెన్షన్‌ మొదలయ్యింది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో మావోయిస్టు అగ్రనేతలు చలపతి, అరుణ్‌, నవీన్‌ ఉన్నారన్న సమాచారం నేపథ్యంలో పోలీసులు అలర్టయ్యారు. శనివారం ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో మావోయిస్టులు మందుపాతర పేల్చిన ఘటనలో ముగ్గురు పోలీసులు గాయపడిన విషయం తెలిసిందే.

అగ్రనేతలే ఏవోబీలో ఉన్నారన్న సమాచారం నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలపై పోలీసులు కూలంకుషంగా విశ్లేషిస్తున్నారు. అసలు ఏం జరుగుతోందని, ఏం జరగబోతోంది అన్న అంశాలపై నిశితంగా సమాచారం సేకరిస్తున్నారు. మరో వైపు ఏజెన్సీలో భద్రతాబలగాలు కూంబింగ్‌ ముమ్మరం చేశాయి. దీంతో ఏజెన్సీలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో స్థానిక గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారు.

Visakhapatnam District
AOB
maoists
police alert
  • Loading...

More Telugu News