Krishna District: ప్రియుడిపై ప్రియురాలి హత్యా యత్నం : విభేదాలే కారణం

  • గత కొన్నాళ్లుగా సహజీవనం
  • విభేదాల నేపథ్యంలో కొబ్బరి కత్తితో దాడి
  • అనంతరం పరారు

కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్న వ్యక్తితో వచ్చిన విభేదాల నేపథ్యంలో అతనిపై హత్యాయత్నానికి పాల్పడింది ఓ మహిళ. వివరాల్లోకి వెళితే...కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన వీరంకి శ్రీనివాసరావు బైపాస్‌ రోడ్డులో టీస్టాల్‌ నిర్వహిస్తున్నాడు. ఇతను గత కొన్నేళ్లుగా లక్ష్మీపురం గ్రామానికి చెందిన మణి అనే మహిళతో సహ జీవనం చేస్తున్నాడు. కొద్ది రోజులుగా వీరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం  ఉదయం మరోసారి వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన మణి కొబ్బరి బోండాలు నరికే కత్తితో శ్రీనివాసరావుపై దాడిచేసి విచక్షణా రహితంగా దాడిచేసి పరారైంది.  వెళ్తూ వెళ్తూ ఇంటి గేటుకు తాళం వేసి పారిపోయింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్‌ఐ మణికుమార్‌ ఆధ్వర్యంలో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గేటు తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించారు. ఆపస్మారక స్థితిలో ఉన్న శ్రీనివాసరావును ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతరం విజయవాడలోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కేసు నమోదు చేసిన పోలీసు నిందితురాలి కోసం గాలిస్తున్నారు.

Krishna District
tiruvuru
murder atack
lady accused
  • Loading...

More Telugu News