Andhra Pradesh: ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ సినిమాపై పెదవి విరిచిన ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు!

  • మీడియా కథనాలు చూసి సినిమాకు వెళ్లా
  • కానీ నాకు అవెంజర్స్ అస్సలు నచ్చలేదు
  • దానికంటే మన ‘బాహుబలి’ బాగుంది

మీడియాలో వస్తున్న కథనాలు చూసి తాను ‘అవెంజర్స్.. ఎండ్ గేమ్’ సినిమాకు వెళ్లానని ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. కానీ తనకు ఈ సినిమా నచ్చలేదనీ, నిరాశకు గురయ్యానని వ్యాఖ్యానించారు. అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమాతో పోల్చుకుంటే బాహుబలిని రాజమౌళి చాలా బాగా తీశారని ప్రశంసించారు.

బాహుబలి సినిమాతో రాజమౌళి సినిమా సాధించిన విజయంపై గర్వపడుతున్నానని చెప్పారు. ఈ మేరకు ఐవైఆర్ కృష్ణారావు ట్వీట్ చేశారు. గత నెల 26న విడుదలైన అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ రూ.16,364 కోట్ల వసూళ్లతో చరిత్ర సృష్టించింది.

Andhra Pradesh
avengers end game
iyr krishnarao
Twitter
ap cs
hollywood
bahubali
  • Loading...

More Telugu News