Elections: కొనసాగుతున్న ఆరో విడత ఎన్నికల పోలింగ్.. బరిలో హేమాహేమీలు

  • ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్
  • 59 నియోజకవర్గాల్లో 979 మంది అభ్యర్థులు
  • ఓటు హక్కు వినియోగించుకోనున్న 10.17 కోట్ల మంది

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నేడు ఆరో దశ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఈ ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది. మొత్తం ఏడు రాష్ట్రాల్లోని 59 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ కొనసాగుతుంది. మొత్తం 979 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకుంటున్నారు.

ఓటింగ్ కోసం 1,13,167 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 10.17 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కేంద్ర మంత్రులు రాధామోహన్‌సింగ్‌, హర్షవర్ధన్‌, మేనకాగాంధీ, నరేంద్రసింగ్‌ తోమర్‌,  రావు ఇంద్రజీత్‌సింగ్‌, సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేష్‌యాదవ్‌, కాంగ్రెస్‌నేత దిగ్విజయ్‌సింగ్‌, భూపీందర్‌సింగ్‌ హుడా, జ్యోతిరాదిత్య సింధియా, షీలాదీక్షిత్‌, క్రీడాకారులు విజేందర్‌సింగ్‌, మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ తదితరులు నేటి ఎన్నికల బరిలో ఉన్నారు. మధ్యప్రదేశ్‌లో 8, ఢిల్లీలో 7, హరియాణాలో 10, ఝార్ఖండ్‌లో 4, పశ్చిమ బెంగాల్‌లో 8, బీహార్‌లో 8, ఉత్తరప్రదేశ్‌లో 14 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ ఈ విడతలో పోలింగ్ జరుగుతోంది.

Elections
sixth phase
Madhya Pradesh
Uttar Pradesh
polling
  • Loading...

More Telugu News