Jagan: వెల్దుర్తి రోడ్డు ప్రమాదంపై జగన్ స్పందన
- ఘటనపై తీవ్ర విచారం
- క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్ష
- మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
కర్నూలు జిల్లా వెల్దుర్తి వద్ద ఈ సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. ఈ ఘటనలో 15 మంది చనిపోయారని తెలుసుకున్న జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. ఈ ఘోర ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన 15 మందీ గద్వాల జిల్లా రామాపురం వాసులు కావడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. వీరంతా సమీప బంధువులని భావిస్తున్నారు.