Telangana: వేదికపై రభస.. ఒకర్నొకరు నెట్టుకున్న కాంగ్రెస్ నేతలు వీహెచ్, నగేశ్!

  • ఇంటర్ విద్యార్థులకు సంఘీభావంగా సభ
  • హాజరైన తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు
  • ఓ కుర్చీ కోసం తోసుకున్న వీహెచ్, నగేశ్

తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన దీక్షా కార్యక్రమం రసాభాసగా మారింది. ఈ సభలో ఓ కుర్చీ విషయమై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు, నగేశ్ ల మధ్య వాగ్వాదం చెలరేగింది. దీంతో ఈ నేతలిద్దరూ ఒకరినొకరు తోసుకోగా, నగేశ్ కిందపడిపోయారు.

దీక్షాస్థలిలో వీహెచ్ కు కేటాయించిన కుర్చీని నగేశ్ తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జ్ కుంతియాకు ఇచ్చినట్లు సమాచారం. దీంతో సహనం కోల్పోయిన వీహెచ్.. నగేశ్ పైకి దూసుకెళ్లారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. తొలుత నగేశ్ వీహెచ్ ను నెట్టివేయగా వెనకనుంచి కొందరు కాంగ్రెస్ నేతలు పట్టుకున్నారు.

దీంతో సహనం కోల్పోయిన వీహెచ్ నగేశ్ ను గట్టిగా తోసేయడంతో ఆయన కింద పడిపోయారు. దీంతో ఇద్దరు నేతలను కాంగ్రెస్ శ్రేణులు విడదీశాయి. అంతకుముందు గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతలపై మండిపడ్డ వీహెచ్.. సభ నుంచి బయటకు వచ్చేశారు.

Telangana
Congress
VH
NAGESH
FIGHT FOR SEAT
  • Loading...

More Telugu News