EMCET: తెలంగాణ ఎంసెట్‌ కీ విడుదల.. అభ్యంతరాలకు 13వ తేదీ గడువు

  • వెబ్‌సైట్‌లో ప్రశ్నలు, సమాధానాలు
  • అభ్యంతరాలుంటే ఆన్‌లైన్‌లో సమర్పించాలి
  • ఈనెల 13 వరకు అభ్యంతరాల స్వీకరణ

తెలంగాణలోని ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించిన ఎంసెట్‌ ప్రాథమిక కీని అక్కడి విద్యా శాఖ విడుదల చేసింది. మొత్తం ప్రశ్నలు, అందుకు సంబంధించిన సమాధానాలను కీలో పొందుపర్చి ఆన్‌లైన్‌లో నిర్వాహకులు పెట్టారు. సమాధానాల ‘కీ’పై అభ్యర్ధులు, అధ్యాపకులు ఎవరికైనా అభ్యంతరాలుంటే తెలియజేయవచ్చునని ఎంసెట్‌ కన్వీనర్‌ స్పష్టం చేశారు. అభ్యంతరాలను ఆన్‌లైన్‌లోనే సమర్పించాలని, ఈ నెల 13వ తేదీ సాయంత్రం వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని తెలిపారు. గడువు తర్వాత వచ్చిన వాటిని పరిగణనలోకి తీసుకోమని తెలిపారు.

EMCET
convenor
key released
  • Loading...

More Telugu News