ajay bhupathi: చైతూ, అజయ్ భూపతి మూవీ ఇప్పట్లో లేనట్టే!

  • 'ఆర్ ఎక్స్ 100'తో హిట్ 
  • ఇంతవరకూ సెట్ కానీ కొత్త ప్రాజెక్టు
  •  ప్రయత్నాల్లోనే వున్న అజయ్ భూపతి

ఈ మధ్య కాలంలో యూత్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ ను సంపాదించుకున్న చిత్రంగా 'ఆర్ ఎక్స్ 100' కనిపిస్తుంది. ఈ సినిమాతో దర్శకుడిగా అజయ్ భూపతి తన సత్తాను చాటుకున్నాడు. ఈ సినిమా ఒక రేంజ్ లో వసూళ్లను రాబట్టడంతో, ఇక ఈ దర్శకుడు వరుస సినిమాలతో హోరెత్తిస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఇంతవరకూ ఆయన మరో ప్రాజెక్టును సెట్ చేసుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

ఆయన తాజా చిత్రం చైతూ హీరోగా ఉండొచ్చనే వార్త కొన్ని రోజులుగా వినిపిస్తోంది. చైతూతో సినిమా కూడా ఇప్పట్లో లేనట్టేనని తెలుస్తోంది. ప్రస్తుతం చైతూ 'వెంకీమామ' సినిమాతో బిజీగా వున్నాడు. ఆ తరువాత సినిమాను ఆయన మేర్లపాక గాంధీ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన సొంత బ్యానర్లో 'రామరాజు' అనే ప్రాజెక్టు చేయనున్నట్టు సమాచారం. అందువలన చైతూ అందుబాటులో లేనట్టేనని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అజయ్ భూపతి ఏ హీరోను సెట్ చేసుకుంటాడో చూడాలి.

  • Loading...

More Telugu News