India: పాక్ వైపు నుంచి వచ్చిన భారీ కార్గో విమానం... వెంటాడి దించేసిన భారత సుఖోయ్ జెట్లు

  • భారత్ లో ప్రవేశించిన జార్జియా విమానం
  • కరాచీ నుంచి ఢిల్లీ వెళుతుండగా ఘటన
  • వాయుసేన సంకేతాలకు స్పందించని వైనం

పాకిస్థాన్ వైపు నుంచి భారత గగనతలంలోకి చొరబడిన ఓ భారీ కార్గో విమానాన్ని భారత వాయుసేన విమానాలు బలవంతంగా దించేశాయి. ఈ మధ్యాహ్నం జైపూర్ సమీపంలో ఆంటోనోవ్ ఏఎన్-12 రవాణా విమానం నిబంధనలు ఉల్లంఘించి భారత గగనతలంలోకి ప్రవేశించగా, భారత వాయుసేనకు చెందిన సుఖోయ్-30 ఎంకేఐ ఫైటర్ జెట్ విమానాలు దాన్ని వెంబడించాయి.

భారత వాయుసేన పంపిన సంకేతాలను ఏఎన్-12 విమాన సిబ్బంది పట్టించుకోకపోవడంతో దాన్ని జైపూర్ విమానాశ్రయంలో బలవంతంగా దించేశారు. ఆ విమానం జార్జియాకు చెందిన మోటార్సిచ్ అనే ఇంజినీరింగ్ సంస్థకు చెందినదిగా భావిస్తున్నారు. అయితే, కరాచీ నుంచి ఢిల్లీ వెళ్లేందుకు ఆ విమానానికి ఏటీఎస్ నిర్దేశించిన మార్గంలో కాకుండా మరో మార్గంలో పయనించడం ఈ ఘటనకు కారణమైంది. కాగా, ఆ విమానంలో ఏముందన్న విషయం తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించనున్నాయి.

  • Loading...

More Telugu News