Rahul Gandhi: రాహుల్ కోర్టు ధిక్కారం కేసు.. తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు
- ‘చౌకీదార్ చోర్ హై’ అని వ్యాఖ్యానించి చిక్కులు
- బేషరతుగా క్షమాపణ చెప్పిన రాహుల్
- తనకు అపారమైన గౌరవముందన్న రాహుల్
రాఫెల్ ఒప్పందంపై ‘చౌకీదార్ చోర్ హై’ అనే వ్యాఖ్యలను సుప్రీంకోర్టుకు ఆపాదిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చిక్కులు కొని తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖీ సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ వేశారు. ఈ విషయంలో రాహుల్ సుప్రీంకోర్టుకు బేషరతుగా క్షమాపణ కూడా చెప్పారు.
అత్యున్నత న్యాయస్థానంపై తనకు అపారమైన గౌరవముందన్నారు. తనపై దాఖలైన కోర్టు ధిక్కారం కేసును కొట్టి వేయాలని సుప్రీంను కోరారు. అందుకు సంబంధించిన అఫిడవిట్‌ను కూడా దాఖలు చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించిన తీర్పును నేడు సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది.