modi: కాంగ్రెస్ కు ఈసారి ఆ 44 సీట్లు కూడా రావు: మోదీ
- ఇప్పటి కంటే ఎక్కువ సీట్లు బీజేపీకి వస్తాయి
- కాంగ్రెస్ కు ఓటు వేసేందుకు ప్రజలు సిద్ధంగా లేరు
- ఓడిపోతున్నామనే విషయం విపక్షాలకు అర్థమైంది
ప్రాంతీయ పార్టీల సహకారంతోనే ఈసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందనే అంచనాలను ప్రధాని మోదీ తోసిపుచ్చారు. బీజేపీకి ఇప్పుడున్న సంఖ్య కంటే ఎక్కువ సీట్లే వస్తాయని చెప్పారు. పూర్తి మెజార్టీతో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎన్డీయే కూటమి సంఖ్యాబలం మరింత పెరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేందుకు ప్రజలు సిద్ధంగా లేరని... ఆ పార్టీకి ఇప్పుడున్న 44 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు.
ప్రస్తుతం తమకు తగినన్ని సీట్లు లేని చోట కూడా ఈసారి సీట్లు పెరుగుతాయని మోదీ ధీమా వ్యక్తం చేశారు. దేశంలోని నలుమూలల్లో పాగా వేస్తామని చెప్పారు. ఓడిపోతున్నామనే విషయం విపక్ష పార్టీలకు అర్థమైందని... అందుకే అనవసరంగా తనను, ఈసీని, ఈవీఎంలను విమర్శిస్తున్నారని అన్నారు. ఈ ఐదేళ్లు తాను ప్రజలతో మమేకమై గడిపానని చెప్పారు.