sensex: నేడూ కుదేలే.. వారమంతా నష్టాల్లోనే ముగిసిన మార్కెట్లు!

  • వరుసగా ఎనిమిదో రోజు నష్టపోయిన దేశీయ మార్కెట్లు
  • 95 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 6 శాతం పైగా పతనమైన టాటా స్టీల్

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఎనిమిదో రోజు నష్టాలు మూటగట్టుకున్నాయి. ఈ వారమంతా మార్కెట్లు నష్టాల్లోనే ట్రేడయ్యాయి. అమెరికా-చైనా ల మధ్య వాణిజ్య యుద్ధం మార్కెట్లపై ప్రభావం చూపింది. దీనికి తోడు రూపాయి విలువ తగ్గడం కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీసింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 95 పాయింట్లు నష్టపోయి 37,462కి పడిపోయింది. నిఫ్టీ 22 పాయింట్లు కోల్పోయి 11,278 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (2.94%), భారతి ఎయిర్ టెల్ (2.09%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.88%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (0.81%), మహీంద్రా అండ్ మహీంద్రా (0.57%).

టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-6.10%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-4.07%), యస్ బ్యాంక్ (-3.70%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.44%), ఓఎన్జీసీ (-1.74%).

  • Loading...

More Telugu News