Mahesh Babu: భావోద్వేగానికి గురైన 'అల్లరి' నరేశ్

  • 'అల్లరి'తో కెరియర్ మొదలు 
  • ఇటీవల తగ్గిన హీరో అవకాశాలు
  •  'మహర్షి'లో ముఖ్యమైన పాత్ర

హీరోగా చాలా వేగంగా 50 సినిమాలను పూర్తి చేసిన నరేశ్ కి, ఆ తరువాత వరుస పరాజయాల కారణంగా దూకుడు తగ్గింది. ఈ నేపథ్యంలోనే ఆయన మల్టీ స్టారర్ల వైపు ఆసక్తి చూపడమే కాకుండా, ముఖ్యమైన పాత్రలను పోషించడానికి కూడా ఉత్సాహాన్ని చూపుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన తాజా చిత్రంగా 'మహర్షి' నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో నరేశ్ పోషించిన పాత్రకి ప్రశంసలు దక్కుతున్నాయి.

ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో  'అల్లరి' నరేశ్ మాట్లాడుతూ .. 'మహర్షి' సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ .. నా పాత్రకి దక్కుతోన్న ఆదరణ ఆనందాన్ని కలిగిస్తున్నాయి. 17 సంవత్సరాల క్రితం మే 10వ తేదీన నా మొదటి సినిమాగా 'అల్లరి' వచ్చింది. ఆ సినిమాలో నేను 'రవి' అనే పాత్రను పోషించాను .. 'మహర్షి'లోను 'రవి' అనే పాత్రనే చేశాను. అందువలన ఈ సినిమాతో నా లైఫ్ ఫుల్ సర్కిల్ పూర్తయినట్టు నేను భావిస్తున్నాను" అంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యాడు. 

  • Loading...

More Telugu News