ceo: ‘కోడ్’ పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం దురదృష్టం: ఈసీపై మంత్రి ప్రత్తిపాటి ఫైర్

  • రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా ‘కోడ్’ ను కొంత సవరించాలి
  • బాధ్యత కలిగిన వారు సమీక్షలు నిర్వహిస్తే తప్పేంటి?
  • సమీక్షలు, కేబినెట్ నిర్వహించే అధికారం బాబుకు ఉంది

ఎన్నికల కోడ్ పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం దురదృష్టకరమని ఈసీపై మంత్రి ప్రత్తిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా ‘కోడ్’ ను కొంత సవరించాల్సిన అవసరం ఉందని, బాధ్యత కలిగిన వారు సమీక్షలు నిర్వహిస్తే తప్పేంటి? అని ప్రశ్నించారు. సమీక్షలు, కేబినెట్ భేటీ నిర్వహించే అధికారం చంద్రబాబుకు ఉందని, తాగునీటి సమస్య, పశుగ్రాసం కొరత పట్ల సమీక్షించాల్సి ఉందని అన్నారు.

ceo
dwivedi
minister
pratipatti
election code
  • Loading...

More Telugu News