Vijay Devarakonda: అప్పటి నుంచీ అదే పేరు కొనసాగుతోంది: విజయ్ దేవరకొండ

  • స్కూల్లో ‘దేవెరకొండ’ అని రాశా
  • అదే కొనసాగుతూ వస్తోంది
  • ప్రతి ఒక్కరినీ సరిదిద్దే రకం కాదు

ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ తన పేరుకు సంబంధించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. హిందూస్థాన్ టైమ్స్ సంస్థ నిర్వహించిన ఇండియాస్ మోస్ట్ స్టైలిస్ట్ స్టార్ అవార్డ్స్ వేడుకలో విజయ్, హాటెస్ట్ స్టైలిష్ స్టార్ అవార్డును అందుకున్నారు. అయితే అవార్డును ప్రకటించే క్రమంలో బాలీవుడ్ నటుడు తుషార్ కపూర్ ‘విజయ్ దేవరాకొండ’ అని సంబోధించారు.

ఈ సందర్భంగా ఓ విలేఖరి విజయ్‌ను ఇప్పటి వరకూ ప్రజలు మిమ్మల్ని ఎన్ని రకాల పేర్లతో పిలిచారని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా విజయ్, ‘‘నాకు తెలిసినంతవరకు నా పేరును తప్పుగా రాసుకున్న తొలి వ్యక్తిని నేనే. స్కూల్లో ‘దేవెరకొండ’ అని రాశాను. అప్పటినుంచి అదే కొనసాగుతూ వస్తోంది. అలాగని నేను ప్రతి ఒక్కరి వద్దకు వెళ్లి నా పేరును సరిగ్గా పలకండి అని వారిని సరిదిద్దే రకాన్ని కాను. నాకు నా పేరు కరెక్ట్‌గా వినిపించినంత వరకు నాకేం సమస్య లేదు’’ అని తెలిపాడు.

Vijay Devarakonda
School
Hindustan Times
Tushar kapoor
Reporter
  • Loading...

More Telugu News