Sangareddy District: సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో మాయమైన శిశువు ఆచూకీ దొరికింది!
- శిశువును అపహరించిన సంతోష్, శోభ
- శివనగర్‌లో శిశువును గుర్తించిన పోలీసులు
- తల్లి పాలు లేకపోవడంతో అనారోగ్యం
సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో మాయమైన శిశువు ఎట్టకేలకు తల్లి ఒడి చేరనుంది. సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో మూడు రోజుల క్రితం శిశువు మాయమైంది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి సమీపంలోని శివనగర్‌లో పోలీసులు ఆ శిశువును గుర్తించారు. బంగారి సంతోష్, శోభలు శిశువును అపహరించినట్టు పోలీసులు తేల్చారు.
సంతోష్, శోభ దంపతులకు వారం క్రితం పాప పుట్టి పురిట్లోనే మృతి చెందింది. ఆ స్థానంలో వారు ఈ శిశువును అపహరించారని పోలీసుల విచారణలో తెలిసింది. నిందితుల నుంచి శిశువును తీసుకుని సంగారెడ్డి డీఎస్పీకి అప్పగించారు. అయితే మూడు రోజులుగా పాపకు తల్లి పాలు లేకపోవడంతో శిశువు అనారోగ్యానికి గురైంది. దీంతో వైద్య పరీక్షల నిమిత్తం మెదక్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శిశువు తల్లిదండ్రులను కూడా అదే ఆసుపత్రికి తీసుకెళ్లారు.