Andhra Pradesh: లోకేశ్ ను కలిసిన కిడారి శ్రావణ్

  • రేపటితో ముగియనున్న శ్రావణ్ కుమార్ పదవీకాలం
  • మంత్రి పదవికి రాజీనామాపై చర్చ
  •  సీఎంకు తన రాజీనామా పత్రం ఇవ్వనున్న కిడారి

ఆంధ్రప్రదేశ్ గిరిజన, వైద్య శాఖ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ పదవీకాలం రేపటితో పూర్తి కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నాయుడు నివాసానికి ఆయన వెళ్లారు. మంత్రి నారా లోకేశ్ తో భేటీ అయ్యారు. మంత్రి పదవికి రాజీనామా అంశంపై వీరి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. ఇదిలా ఉండగా, కిడారి తన రాజీనామా పత్రాన్ని సీఎంకు ఈరోజు సమర్పించనున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత సదరు రాజీనామా పత్రాన్ని గవర్నర్ ఆమోదానికి పంపాల్సి ఉంటుంది.

Andhra Pradesh
cm
chan
kidari
sravan
  • Loading...

More Telugu News