gabbar singh sai: శ్రీహరి వంటి మంచి మనిషిని నేను చూడలేదు: 'గబ్బర్ సింగ్' సాయి

  • శ్రీహరి మంచి నటుడు 
  • కష్టాల్లో వుంటే ఆదుకునేవాడు
  •  ఆయన లేని లోటును పూడ్చలేము

'గబ్బర్ సింగ్' సినిమాలో 'అంత్యాక్షరి' గ్యాంగ్ లో ఒకరిగా కనిపించిన సాయికి, ఆ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత ఆయన బిజీ కావడానికి ఆ సినిమా ఎంతో హెల్ప్ చేసింది. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. తన కెరియర్ తొలినాళ్లలో తనకి సాయం చేసిన శ్రీహరిని గురించి ప్రస్తావించాడు.

"నేను సినిమా పరిశ్రమకి వచ్చిన తొలిరోజుల్లోనే శ్రీహరి గారిని కలిశాను. ఆయన ఎంత మంచి నటుడో .. అంత మంచి మనసున్న మనిషి. ఆయనలాంటి వ్యక్తిని మళ్లీ నేను చూడలేదు. చిన్న ఆర్టిస్టులను ఆయన ఎంతో ఆప్యాయంగా చూసుకునేవాడు. కష్టపడి పైకి వచ్చిన కారణంగా, ఎవరు ఎలాంటి కష్టాల్లో వున్నా వెంటనే ఆదుకునేవాడు. చేతికి ఎంత వచ్చిందనేది కూడా చూసుకోకుండా దానధర్మాలు చేసేవాడు. వ్యక్తిగా .. ఆర్టిస్టుగా ఆయన లేని లోటును పూడ్చలేము" అని చెప్పుకొచ్చాడు. 

gabbar singh sai
  • Loading...

More Telugu News