tv9: టీవీ9లో నాకు తెలియకుండానే నా షేర్లు అమ్మేశారు: హీరో శివాజీ

  • టీవీ9లో హీరో శివాజీకి వాటాలు
  • తన షేర్లు అమ్మేశారంటూ ట్రైబ్యునల్ ను ఆశ్రయించిన శివాజీ
  • వాటాలు అమ్మకూడదంటూ ట్రైబ్యునల్ ఉత్తర్వులు

టీవీ9లో ఈరోజు చోటు చేసుకుంటున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. రవిప్రకాశ్ ను సీఈవో పదవి నుంచి తొలగించారు. తాజాగా ఈ వ్యవహారంలో హీరో శివాజీ అంశం కూడా తెరపైకి వచ్చింది. టీవీ9లో తాను మైనార్టీ షేర్ హోల్డర్ నని... తనకు తెలియకుండానే తన షేర్లను అమ్మేశారని ఇప్పటికే నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ను శివాజీ ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో, టీవీ9 వాటాలను కొనవద్దని ట్రైబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు అమల్లో ఉండగానే యాజమాన్యం బదిలీ కావడం గమనార్హం.

  • Loading...

More Telugu News