Andhra Pradesh: జోరు పెంచిన వైసీపీ.. కౌంటింగ్ ఏజెంట్లకు విజయవాడలో ప్రత్యేక శిక్షణ!

  • ఈ నెల 16న విజయవాడలో కార్యక్రమం
  • తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు
  • హాజరు కావాల్సిందిగా నేతలు, ఏజెంట్లకు ఆదేశం

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీతో పాటు లోక్ సభ స్థానాలకు గతనెల 11న ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల 23న వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో తమ కౌంటింగ్ ఏజెంట్లకు వైసీపీ శిక్షణా శిబిరాన్ని ఏర్పాటుచేసింది. విజయవాడలోని బందరు రోడ్డులో ఉన్న ఏ1 కన్వెన్షన్ సెంటర్ లో ఈ నెల 16న ఈ కార్యక్రమం జరగనుంది.

ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ సాగే ఈ కార్యక్రమంలో ఓట్ల లెక్కింపునకు సంబంధించిన అంశాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కౌంటింగ్ ఏజెంట్లకు అవగాహన కల్పిస్తారు. కాగా, వైసీపీ అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థులు తమ కౌంటింగ్ ఏజెంట్లతో కలిసి శిక్షణా తరగతులకు హాజరుకావాలని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ చార్జి విజయసాయిరెడ్డి కోరారు.

Andhra Pradesh
YSRCP
counting agents
training
  • Loading...

More Telugu News