postal ballets: పోస్టల్ బ్యాలెట్స్ లో అవకతవకలపై సీఈఓకు వైసీపీ ఫిర్యాదు

  • మడకశిరలో రెండు పోస్టల్ బ్యాలెట్స్ ఇచ్చారు
  • ఇందుకు సంబంధించిన ఆధారాల సమర్పణ
  • నివేదిక పంపాలని ‘అనంత’ కలెక్టర్ కు ద్వివేది ఆదేశం

పోస్టల్ బ్యాలెట్స్ లో అవకతవకలపై ఏపీ రాష్ట్ర సీఈఓ ద్వివేదికి వైసీపీ ఎమ్మెల్యే తిప్పేస్వామి, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో 108 మందికి రెండు పోస్టల్ బ్యాలెట్స్ ఇచ్చారంటూ ఆధారాలతో సహా ద్వివేదికి తిప్పేస్వామి సమర్పించారు. ఈ విషయమై సంబంధిత రిటర్నింగ్ అధికారి (ఆర్వో) సమాధానం చెప్పలేదని, బాధ్యులపై చర్యలు చేపట్టాలని ద్వివేదిని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ద్వివేది ఇందుకు సంబంధించి నివేదిక పంపాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.

postal ballets
YSRCP
madakasira
ceo
tippe swamy
pilli subhash chandra bose
dwivedi
  • Loading...

More Telugu News