Telangana: అప్పట్లో కేటీఆర్ చాలాసార్లు మా ఇంటికి వచ్చారు.. టీఆర్ఎస్ లో చేరాలని ఆహ్వానించారు!: కొండా విశ్వేశ్వరరెడ్డి

  • తెలంగాణ ఉద్యమ సమయంలో పోరాడాను
  • కేసీఆర్ కంట్లో పడటంతో పార్టీలోకి ఆహ్వానించారు
  • రంగారెడ్డిలో నా గెలుపుతో పార్టీకి ఊపు వచ్చింది

తన తాత తెలంగాణ కోసం పోరాడారని కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. తెలంగాణ రావడానికి కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలే కారణమని వ్యాఖ్యానించారు. ‘‘జీ, విప్రో వంటి సంస్థల్లో పనిచేశాక యువకుల కోసం నేను జాబ్ ప్రోగ్రామ్స్ పెట్టేవాడిని. తెలంగాణ ఉద్యమంలో కూడా చురుగ్గా పాల్గొన్నా.

దీంతో ఈ విషయం కేసీఆర్ గారి దృష్టికి వెళ్లింది. టీఆర్ఎస్ లో చేరాలని నన్ను 2-3 సార్లుు ఆహ్వానించారు. ఇక కేటీఆర్ గారు అయితే పార్టీలో చేరాలని కోరడానికి మా ఇంటికి వచ్చారు. అయితే ‘తెలంగాణ సాధనే నా లక్ష్యం. రాజకీయాలు కాదు’ అని కేటీఆర్ కు చెప్పా’’ అని అప్పటి ఘటనలను గుర్తుచేసుకున్నారు.

దీంతో కేటీఆర్ స్పందిస్తూ..‘నిజమే. తెలంగాణ సాధించాలంటే రోడ్ల మీద ఉద్యమం చేస్తే సరిపోదు. మీలాంటి వాళ్లు రాజకీయాల్లోకి కూడా రావాలి అని కన్విన్స్ చేశారు. ఇందుకోసం నన్ను చాలాసార్లు కలిశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు షెల్జా కుమారి, గులాం నబీ ఆజాద్ లను కలిసి రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నట్లు చెప్పా.

వాళ్లంతా నా నిర్ణయాన్ని స్వాగతించారు. నా ముందు రెండు ఆప్షన్లు కాంగ్రెస్, టీఆర్ఎస్ ఉండగా, టీఆర్ఎస్ ను ఎంచుకున్నా’ అని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో తాను ఎంపీగా గెలవడంతో చాలామంది టీడీపీ, కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ లో చేరారనీ, పార్టీకి మంచి ఊపు వచ్చిందని అన్నారు.

  • Loading...

More Telugu News