priyanka vadra: అప్పటి ప్రధానిని అవమానించిన మీ సోదరుడు రాహుల్‌ అహంకారం మాటేమిటి?: ప్రియాంకకు సుస్మాస్వరాజ్‌ సూటి ప్రశ్న

  • ఆర్డినెన్స్‌ చింపివేయడమే అసలు అహంకారం
  • మీ కుటుంబ సభ్యుల అహంకారం ముందు మోదీ ఎంత
  • మీరా నీతులు చెప్పేదని ఎద్దేవా

అహంకారానికి పేటెంట్‌ లాంటిది మీ కుటుంబం తీరని, అటువంటి మీరు ప్రధాని మోదీని మహాభారతంలో దుర్యోధనుడితో పోల్చడం దురదృష్టకరం అని ప్రియాంకా వాద్రకు దీటుగా సమాధానం ఇచ్చారు కేంద్ర విదేశాంగ మంత్రి సుస్మాస్వరాజ్‌. ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేశారు. హరియాణాలోని ఓ ప్రచార సభలో ప్రియాంక మాట్లాడుతూ మోదీకి దుర్యోదునుడికి ఉన్నంత అహంకారం ఉందని చేసిన వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు.

 2013లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం జారీ చేసిన ఓ అత్యవసర ఆర్డినెన్స్‌ను రాహుల్‌గాంధీ చింపి వేయడాన్ని, అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పట్ల అవమానకరంగా వ్యవహరించడాన్ని సుష్మాస్వరాజ్‌ గుర్తు చేశారు. రాష్ట్రపతి ఆమోదించిన ఆర్డినెన్స్‌ను చింపివేసిన మీ సోదరుడు రాహుల్‌ గాంధీ అహంకారానికి మించిన అహంకారం ఏముంటుందో చెప్పాలని ప్రియాంకను ప్రశ్నించారు.

అలాగే, తుపాన్‌ పరిస్థితిపై తెలుసుకునేందుకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని మోదీ సంప్రదించగా, ప్రధానితో మాట్లాడడానికి ఆమె నిరాకరించడాన్ని సుష్మా తప్పుపట్టారు. ఈ రోజు మీరు ముఖ్యమంత్రిగా అలా వ్యవహరించినా, రేపు ఆయనతో మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తారని ట్విట్టర్‌లో ప్రశ్నించారు.

priyanka vadra
Narendra Modi
sushma swaraj
  • Loading...

More Telugu News