Chandrababu: ఏపీ క్యాబినెట్ భేటీ వాయిదా... ఈ నెల 14న జరిగే అవకాశం?

  • ఇప్పటికే సీఎస్ కు లేఖ పంపిన ఏపీ సర్కారు
  • రెండ్రోజుల ముందు సీఈసీ అనుమతి తీసుకోవాలని సూచించిన సీఎస్
  • భేటీ జరిపే విషయంలో సీఎం పునరాలోచన!

ఓవైపు రాష్ట్రంలో ఎన్నికల సంఘం, సీఎస్ లతో సీఎం చంద్రబాబుకు విభేదాలు పొడసూపిన క్రమంలో ఏపీ క్యాబినెట్ భేటీపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఈ నెల 10న ఎలాగైనా క్యాబినెట్ భేటీ నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించుకోవడం తెలిసిందే. అయితే, అది సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడంలేదు. క్యాబినెట్ భేటీకి అనుమతి కోరుతూ సీఎస్ కు లేఖ పంపినప్పటికీ, ఎన్నికల కోడ్ ఉన్నందున రెండ్రోజుల ముందే కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని సీఎస్ స్పష్టం చేశారు.

అంతేకాకుండా, ఏపీ ప్రభుత్వం తమ భేటీ అజెండాలో పేర్కొన్న విషయాలను నిర్ధారించుకునేందుకు సంబంధిత శాఖల నుంచి సీఎస్ సమాచారం తెప్పించుకోవాల్సి ఉంటుంది. ఈ సమాచారాన్ని సీఎస్ నేతృత్వంలోని కమిటీ పరిశీలించి ఆపై దాన్ని ఎన్నికల సంఘానికి నివేదిస్తారు. తదనంతరమే ఎన్నికల సంఘం క్యాబినెట్ భేటీకి అనుమతి ఇవ్వాలా? వద్దా? అనేది నిర్ణయించుకుంటుంది.

ఈ నేపథ్యంలో, సమయం తక్కువగా ఉండడంతో ఈ నెల 10న క్యాబినెట్ భేటీ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని అనుమతులు తీసుకుని ఈ నెల 14న క్యాబినెట్ భేటీ నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News