Andhra Pradesh: మాజీ ఎమ్మెల్సీ రామ్ రెడ్డి మృతి.. స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు!

  • టీడీపీ మీడియా కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి తండ్రే రామ్ రెడ్డి
  • ప్రకాశ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన చంద్రబాబు
  • రామ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థన

తెలుగుదేశం తెలంగాణ పార్టీ మీడియా కార్యదర్శి జి.ప్రకాశ్ రెడ్డి తండ్రి, మాజీ ఎమ్మెల్సీ రామ్ రెడ్డి ఈరోజు కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. రామ్ రెడ్డి మృతి పట్ల చంద్రబాబు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈరోజు ట్విట్టర్ లో చంద్రబాబు స్పందిస్తూ..‘తెలంగాణ టీడీపీ మీడియా కార్యదర్శి జి.ప్రకాశ్ రెడ్డి తండ్రి, శాసనమండలి మాజీ సభ్యులు శ్రీ జి.రామ్ రెడ్డి మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. శత వసంతాల జీవితంలో ప్రజాసేవకే రామ్ రెడ్డి అంకితమయ్యారు, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నాను’ అని తెలిపారు.

Andhra Pradesh
Telugudesam
Telangana
prakash reddy
ramreddy
dead
Twitter
  • Loading...

More Telugu News