potti veerayya: శోభన్ బాబుగారు ఇచ్చిన సలహా నన్ను ఇక్కడివరకూ తీసుకొచ్చింది: నటుడు పొట్టి వీరయ్య

  • చిన్నప్పుడే నాటకాలు వేశాను 
  • చదువు అబ్బకపోవడంతో చెన్నై వెళ్లాను 
  • 'అగ్గిదొర'లో మొదటి అవకాశం వచ్చింది

తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ సినిమాల్లో పొట్టి వీరయ్య నటించారు. తనదైన బాడీ లాంగ్వేజ్ తో .. డైలాగ్ డెలివరీతో ఆయన నవ్వులు పూయించారు. అలాంటి పొట్టి వీరయ్య తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన కెరియర్ ను గురించి ప్రస్తావించారు. "స్కూల్ డేస్ లోనే నేను నాటకాలు వేసేవాడిని. చదువు పెద్దగా అబ్బలేదు .. దాంతో సినిమాల్లో నటించాలనే కోరికతో చెన్నైకి వెళ్లాను. షూటింగ్స్ కి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ను సప్లై చేసే షాపులో చేరాను. ఆ పని కారణంగా స్టూడియోల్లోకి వెళ్లొచ్చనే ఆలోచనతోనే ఆ పనిలో చేరాను.

అలా ఒక రోజున గోల్డెన్ స్టూడియోకి వెళ్లినప్పుడు శోభన్ బాబుగారు కనిపించారు. నన్ను నేను పరిచయం చేసుకుని, సినిమాల్లో నటించాలని వుందని చెప్పాను. అప్పుడు ఆయన 'నీకు తగిన వేషాలు భావనారాయణగారి సినిమాల్లో .. విఠలాచార్యగారి సినిమాల్లో ఉంటాయి. వాళ్లిద్దరినీ కలవండి .. వాళ్లు వేషాలు ఇస్తామని అంటే ఇక్కడ వుండండి .. లేదంటే తిరిగి వెళ్లిపోవడమే మంచిది' అని ఆయన మంచి సలహా ఇచ్చారు. దాంతో నేను వెళ్లి విఠలాచార్యగారిని కలవడం .. ఆయన నాకు 'అగ్గిదొర' సినిమాలో వేషం ఇవ్వడం జరిగిపోయాయి" అని చెప్పుకొచ్చారు. 

  • Loading...

More Telugu News