jharkhand: ఐదో విడత పోలింగ్‌లో ఓటేసిన 105 ఏళ్ల బామ్మగారు

  • తల్లిని భుజాలపై వేసుకుని పోలింగ్‌ కేంద్రానికి తెచ్చిన కొడుకు
  • ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకున్న వృద్ధురాలు
  • జార్ఖండ్‌ రాష్ట్రం హజారిబాగ్‌లో ఘటన

ఐదో విడత ఎన్నికల పోలింగ్‌లో జార్ఖండ్‌ రాష్ట్రం హజారిబాగ్‌ నియోజకవర్గంలో ఓ ప్రత్యేకత చోటు చేసుకుంది. నియోజక వర్గంలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో 105 ఏళ్ల వయసు వృద్ధురాలు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధురాలిని ఆమె కొడుకు భుజాలపై మోసుకుంటూ పోలింగ్‌ కేంద్రానికి తీసుకురాగా, ఆమె ఉత్సాహంగా తన ఓటు హక్కు వినియోగించుకోవడం విశేషం. దేశవ్యాప్తంగా బిహార్‌, జమ్ము కశ్మీర్‌, యూపీ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల్లోని 51 లోక్‌సభ నియోజక వర్గాల్లో ఐదో విడత పోలింగ్‌  జరుగుతున్న విషయం తెలిసిందే.

jharkhand
hajaribagh
105 years old women
casting vote
  • Loading...

More Telugu News